• Farmrise logo

    బేయర్ ఫార్మ్ రైజ్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి

    నిపుణుల వ్యవసాయ సలహాల కోసం!

    యాప్ ను ఇన్ స్టాల్ చేయండి
  • హలో బేయర్
    తిరిగి
    కిసాన్ ఐడీ / రైతు ఐడీ అంటే ఏమిటి? ఎందుకు అవసరం? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
    కిసాన్ ఐడీ / రైతు ఐడీ అంటే ఏమిటి? ఎందుకు అవసరం? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
    రైతు రిజిస్ట్రీ (Farmer Registry) అనేది రైతుల వివరాలు, భూమి యజమాన్యం, ప్రభుత్వ పథకాలలో పాల్గొనడం వంటి విషయాలను నమోదు చేసే డిజిటల్ రికార్డు. దీని ద్వారా రైతులకు సబ్సిడీలు, సాయం, మరియు ఇతర ప్రభుత్వ సేవలు సులభంగా లభిస్తాయి. ఎందుకు అవసరం? ఈ నమోదు ద్వారా రైతులు పంటలు, తోటలు, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖకు సంబంధించిన పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కిసాన్ ఐడీ / రైతు ఐడీ ఎలా పని చేస్తుంది? రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఉండే AgriStack పోర్టల్స్‌లో రైతుల వివరాలు నమోదు చేస్తారు. ఈ పోర్టల్స్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) నిర్వహిస్తుంది. అగ్రిస్టాక్ రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభం చేస్తుంది. రైతు పేరు నమోదు, వివరాల చెక్, సబ్సిడీ లాంటి లాభాలు పంపడంలో స్పష్టత, వేగం ఉంటుంది. ________________________________________ ఎక్కడ అందుబాటులో ఉంటుంది? ✅ రాష్ట్రానికి ప్రత్యేకమైన AgriStack పోర్టల్ ✅ మీకు దగ్గరలోని CSC కేంద్రం (Meeseva లాంటిది) ✅ ప్రభుత్వ వ్యవసాయ కార్యాలయం ________________________________________ కిసాన్/రైతు రిజిస్ట్రీ పోర్టల్స్: రాష్ట్రం పోర్టల్ లింక్ ఉత్తరప్రదేశ్ https://upfr.agristack.gov.in/ మహారాష్ట్ర https://mhfr.agristack.gov.in/ ఆంధ్రప్రదేశ్ https://apfr.agristack.gov.in/ కర్ణాటక https://kafr.agristack.gov.in/ ఒడిశా https://odfr.agristack.gov.in/ రాజస్తాన్ https://rjfr.agristack.gov.in/ మధ్యప్రదేశ్ https://mpfr.agristack.gov.in/ అస్సాం https://asdcs.agristack.gov.in/ ఝార్ఖండ్ https://jhdcs.agristack.gov.in/ ________________________________________ రిజిస్టరేషన్ చేయడం ఎలా? (కొత్తగా చేసుకునే రైతుల కోసం) రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ: ➼ స్టార్ట్ చేయడం ఎలా? మీ రాష్ట్రానికి చెందిన AgriStack వెబ్‌సైట్‌ లేదా మీకు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రం (CSC) కు వెళ్లండి. ➼ "Farmer" అనే ట్యాబ్‌ ఎంచుకోండి. మొదటి సారి రిజిస్ట్రేషన్ కోసం "Create New User Account" మీద క్లిక్ చేయండి. ➼ ఆధార్ నంబర్ను నమోదు చేసి eKYC చేయండి. ➼ నిబంధనలపై టిక్ పెట్టి Submit చేయండి. ➼ మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబరుకు వచ్చిన OTPని ఎంటర్ చేసి వెరిఫై చేయండి. ________________________________________ ➼ లాగిన్ చేయడం ఎలా? ➼ మళ్లీ లాగిన్ పేజ్‌కి వెళ్లి "Farmer" ఎంపిక చేయండి. ➼ మీ రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ను User Nameగా ఎంటర్ చేయండి. ➼ మీ పాస్‌వర్డ్ లేదా OTP, అలాగే కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ➼ "Login" క్లిక్ చేస్తే మీరు మీ ఖాతాలోకి వెళ్తారు. ________________________________________ ➼ రైతు వివరాలు పూర్తి చేయడం: ➼ ఆధార్ ద్వారా వచ్చిన మీ ప్రాథమిక వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. ➼ చివరకి స్క్రోల్ చేసి "Register as Farmer" అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ➼ కులం ఎంపిక చేయండి: General / SC / ST / OBC. ➼ ఆధార్ ద్వారా వచ్చిన పేరు, లింగం, పుట్టిన తేదీ చెక్ చేయండి. ➼ చిరునామా వివరాలు – ఆధార్ నుంచి ఆటోమేటిక్‌గా వస్తాయి లేకపోతే మీరు టైప్ చేయవచ్చు. ________________________________________ ➼ భూమి వివరాలు ఇవ్వడం: ➼ భూమి యజమాన్యం లో "Owner" అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ➼ మీ ఖాతా నంబర్ / గటా నంబర్ (Khasra/Gata No) ఎంటర్ చేయండి – ఇది మీ పట్టాదారు పుస్తకంలో ఉంటుంది. ➼ రాష్ట్ర భూ రికార్డు డేటాబేస్ నుంచి భూమి వివరాలు తీసుకుంటుంది. ➼ భూమి యొక్క విస్తీర్ణం మరియు యాజమాన్యం విధానం (ఒక్కరా? లేదా షేర్‌లో ఉన్నదా?) చూసి వెరిఫై చేయండి. ________________________________________ అదనపు భూమి వివరాలు (ఉంటే): మీ వద్ద ఒకటి కంటే ఎక్కువ భూములు ఉంటే, ప్రతి భూమికి ఇదే ప్రక్రియను మళ్లీ చేయండి. "Verify All Land" అనే బటన్ క్లిక్ చేసి అన్ని భూములను ఫైనల్‌గా ధృవీకరించండి. ________________________________________ ➼ సామాజిక వివరాలు: రేషన్ కార్డు/ఫ్యామిలీ ID (ఉంటే) ఎంటర్ చేయండి. లేకపోతే ఈ దశను స్కిప్ చేయవచ్చు. ________________________________________ ➼ అనుమతి (Approval) దశ: భూమి వివరాలను ధృవీకరించడానికి Revenue Department ఎంపిక చేయండి. నిబంధనలను అంగీకరించి Submit చేయండి. ________________________________________ ➼ ఈ-సైన్ ప్రక్రియ: ఆధార్ OTP ద్వారా e-Signature పూర్తి చేయండి. "Submit" బటన్ క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. ________________________________________ ➼ Farmer Enrollment ID పొందడం: మీరు Submit చేసిన తర్వాత, రైతు నమోదు ID (Farmer Enrollment ID) వస్తుంది. Confirmation PDFని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ________________________________________ ➼ రైతు రిజిస్ట్రీకి కావలసిన పత్రాలు: ఈ పత్రాలు రైతు గుర్తింపు, భూమి వివరాలు, ప్రభుత్వ పథకాలకు అర్హత నిరూపించేందుకు అవసరం. 🟢 వ్యక్తిగత గుర్తింపు పత్రాలు: • ఆధార్ కార్డు (eKYCకి తప్పనిసరి) • ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ • రేషన్ కార్డు (కుటుంబ ఆధారిత పథకాలకు) 🟢 భూమి యాజమాన్య పత్రాలు: • Record of Rights (RoR) – ఖతౌని/గటా/ఖస్రా నంబర్లు • భూమి కలిపింపు సర్టిఫికేట్ (LPC) – రెవెన్యూ శాఖ ఇస్తుంది • Mutation Certificate – భూమి పేరు మారినవారికి 🟢 బ్యాంక్, ఆర్థిక పత్రాలు: • బ్యాంక్ పాస్‌బుక్ / ఖాతా నంబర్ (DBT కోసం) • కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) – రుణాలు, స్కీముల కోసం 🟢 అదనపు పత్రాలు (ఉంటే): • లీజ్ ఒప్పందం (ఇద్దంత రైతులకు) • కుల ధ్రువీకరణ పత్రం (SC/ST/OBCకి) • వికలాంగుల సర్టిఫికేట్ (వికలాంగ రైతులకు) ________________________________________ ➼ Farmer ID ద్వారా లాభాలు (AgriStack): AgriStack కింద ఇచ్చే Farmer ID ఒక ప్రత్యేక డిజిటల్ గుర్తింపు సంఖ్య. ఇది రైతు భూమి, బ్యాంక్, పథకాలతో లింక్ అవుతుంది. ✅ ముఖ్యమైన లాభాలు: • ప్రభుత్వ పథకాల్లో చేరడం సులువు (PM-KISAN, ఇన్సూరెన్స్, ఎరువు సబ్సిడీలు) • డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ (DBT): డబ్బు నేరుగా రైతు బ్యాంక్ ఖాతాలోకి • రుణాలు, KCC సౌకర్యం: సులువుగా పొందవచ్చు • డిజిటల్ భూమి రికార్డులు: మోసాలు, భూమి వివాదాలు తగ్గుతాయి • పథక స్థితి ట్రాకింగ్: ఆన్‌లైన్‌లో స్థితి తెలుసుకోవచ్చు • ఒకే డిజిటల్ ఐడి: అన్ని వ్యవసాయ సేవలకు ఉపయోగపడుతుంది ఈ Farmer ID ద్వారా నిజమైన రైతులకు గమనించదగిన లాభాలు త్వరగా, పారదర్శకంగా లభిస్తాయి. ________________________________________ ➼ సహాయం కోసం సంప్రదించండి: 📞 ఫోన్: 011-23382926 📧 ఇమెయిల్: us-it@gov.in
    Some more Government Schemes
    మీ కోసం అందుబాటులో ఉన్న తాజా ప్రభుత్వ పథకాలు మరియు ప్రయోజనాలతో అప్ డేట్ అవ్వండి.
    Government Scheme Image
    Some more Government Schemes
    Some more Government Schemes
    ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన
    No date available
    Government Scheme Image
    Some more Government Schemes
    Some more Government Schemes
    అగ్రిక్లినిక్ మరియు అగ్రిబిజినెస్ సెంటర్స్ స్కీం- నాబార్డ్
    No date available

    మా మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి

    ప్రయాణంలో వ్యవసాయం: మా యాప్‌తో ఎప్పుడైనా, ఎక్కడైనా నిజ-సమయ మార్కెట్ డేటాను యాక్సెస్ చేయండి. మీ భాషలో కూడా అందుబాటులో ఉంది.
    Google Play Image
    సహాయం కావాలా?
    మీ అన్ని సందేహాల కొరకు మా హలో బేయర్ సపోర్ట్ ని సంప్రదించండి
    Bayer Logo
    టోల్ ఫ్రీ హెల్ప్ డెస్క్
    1800-120-4049
    ముఖ్య పుటంమండి